విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ ..! 18 h ago
విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖలో రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.